యూపీలోని వారణాసిలో 19ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సదరు బాలిక మార్చి 29న తన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి లేదు. దీంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారు. ఏప్రిల్ 4న కిడ్నాపర్లు ఆమెకు మత్తు మందు ఇచ్చి ఓ చోట వదిలి పెట్టారు. ఎలాగో తన ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన దారుణాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది నిందితులకు గాను ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.