తమిళ హీరో విశాల్, సుందర్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘మద గజ రాజ’. ఈ మూవీలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సుందర్ మాట్లాడుతూ..సినిమా కథ చెప్పడానికి వెళ్లినప్పుడు విశాల్ లేకపోవడంతో ఆయన్ని అపార్థం చేసుకున్నాని తెలిపారు. కొన్ని రోజులకు నిజం తెలిసాక, తమ్ముడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల కానుంది.