నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కష్టసుఖాలలో పెద్ద కొడుకుగా ఉంటానని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో పల్లెటూర్లను పూర్తిగా విస్మరించి అభివృద్ధిలో వెనుకబడిపోయేలా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.