నర్సాపురం బులియన్ మార్కెట్లో కస్టమ్స్ అధికారుల దాడులు బుధవారం కలకలం రేపాయి. విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా వీడి పట్టణంలోని జైన్ జ్యూయల్ పార్క్ దుకాణంతోపాటు వ్యాపారి నివాసంలో సుమారు పది గంటల పాటు తనిఖీలు చేశారు. బంగారం కొనుగోలు అమ్మకాలతో పాటు కొన్ని రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. నాన్ డ్యూటీ పెయిడ్ బంగారo ఉందన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం.