ఏలూరు జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ఖరారు ప్రక్రియకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 144 మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి 5499 టెండర్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే ఈరోజు కలెక్టర్ వెట్రి సెల్వి సమక్షంలో లాటరీ విధానం ద్వారా ఏలూరు మినీ బైపాస్ లోని చలసాని గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది.