జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఏఈగా జ్వాలా దీప్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా గుడివాడ నుంచి ఆమె జంగారెడ్డిగూడెం వచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ కొమ్మినేని వెంకట రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పట్టణ స్థితిగతులను ఆమెకు వివరించారు. అలాగే పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జ్వాల దీప్తి తెలిపారు.