తణుకు మండలం దువ్వ 2గ్రామం లో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. డాక్టర్ సాయిభవాని ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురు వృద్ధులు, గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. సీహెచ్ ఓ ఉదయలక్ష్మి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పి జ్యోతి, ఎంపీ హెచ్ ఏ వెంకట్రావు, ఏఎన్ఎం లక్ష్మి, పైలట్ ఆనంద్,ఆశ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.