AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత అన్ని వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌తో జరిగిన చర్చల సందర్భంగా రూ.500 కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామని ఆశా ప్రతినిధులు తెలిపారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే.