యలమంచిలి మండలం మర్రిబంద వద్ద ఫ్యూజన్ బ్రిక్ కంపెనీలో వంట గ్యాస్ లీకై తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికుల్లో కేశవరావు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కంపెనీలో శనివారం రాత్రి కార్మికులు కేశవరావు, లోకనాథం, కృష్ణారెడ్డి వంట చేస్తుండగా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విశాఖ కేజీహెచ్ లో చేర్పించారు.