మునగపాక గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 37 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ పి. ప్రసాదరావు సోమవారం వెల్లడించారు. ఫిర్యాదు మేరకు తన సిబ్బందితో దాడి నిర్వహించిన ఎస్ఐ ప్రసాదరావు, అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారిని గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.