యోగా ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన మహిళ కానిస్టేబుల్ ఎం నిర్మలను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం అచ్యుతాపురంలో అభినందించారు. ఛతీస్ ఘడ్ రాష్ట్రం బిలాయిలో ఆల్ ఇండియా పోలీసు యోగా ఛాంపియన్షిప్ లో పాల్గొని సత్తా చాటిన నిర్మల కాంస్య పతకం సాధించారు. అచ్యుతాపురంలో మహిళ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిర్మల భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.