అచ్యుతాపురం మండలం మడుతూరు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన కార్యదర్శి మోటూరు శ్రీవాణి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.