బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం రావణ దహనం వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత భాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక దశరా పండగ అని అభివర్ణించారు. నరకాసురుడిని దుర్గాదేవి మహిషాసుర మర్ధని అవతారంలో సంహారం చేసిన రోజు అని గుర్తు చేశారు.