రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణకేంద్రం ఆదివారం తెలిపింది. ఇది మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. ఈనెల 23 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని, గంటకు 45-65 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.