జీవీఎంసీ 90వ వార్డు పైడిమాంబ రజక కాలనీ మరియు లక్ష్మీ నగర్ ఎఫ్ బ్లాక్ నందు మురికి కాలువలు శిథిలావస్థకు చేరడంతో స్థానిక కాలనీ వాసులు సమస్యను 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ దృష్టికి తీసుకురాగా, తక్షణమే ఆయన స్పందించి శనివారం జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యటించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగింది. వార్డ్ ఇంచార్జ్ బాబీ, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.