గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో కణితి కళింగవీధిలో అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాధం శనివారం పరిశీలించారు. కణితి కళింగవీధిలో జీవీఎంసీ వారి నిధులతో ఏర్పాటు చేయనున్న చిల్డ్రన్స్ ఔట్ డోర్ ప్లే ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ నిర్మాణాలపై కాంట్రాక్టర్‌తో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పనుల నాణ్యతలో రాజీ పడోద్దని సూచించారు.