వేపాడ మండలంలో వేపాడ తదితర పంచాయతీలలో బుధవారం ఏపీ ఎమ్ ఐ పి పిడి లక్ష్మీనారాయణ, ఎంపీడీవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో విసృతంగా క్లోరినేషన్, శానిటేషన్ పనులను చేపట్టారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు.