దానా తుఫాను కారణంగా గురువారం రాత్రి నుంచి జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను ఒడిషా వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున జిల్లాలో విస్తరంగా వర్షాలు ఉండవచ్చని అన్నారు. తుఫాన్ పై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.