పల్లె పండుగ కార్యక్రమం బాడంగి మండలంలోని గజరాయునివలసలో బుధవారం ఘనంగా జరగనుంది. ఈ మేరకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన 10 గంటలకు గ్రామంలో పర్యటించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమన్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే లక్షుం నాయుడు కూడా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.