AP: ఈ నెల 27 నుంచి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లకు నాన్ రెసిడెన్షియల్ విధానంలో రోజూ శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు మండల స్థాయిలో, జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో శిక్షణ ఉంటుందని పేర్కొంది. ఈ శిక్షణను విజయవంతం చేసేలా అధికారులు చొరవ చూపాలని విద్యాశాఖ సూచించింది.