ఆడి కృతిక సందర్భంగా మంగళవారం నాయుడుపేటలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వేలాయుదాలతో నగరోత్సవం నిర్వహించారు. పసుపు దుస్తులు ధరించి వేలాయుదాలు చేతపట్టుకొని భక్తులు బ్రాహ్మణ వీధిలోని శ్రీ వళ్లీ దేవసేన సమేత కళ్యాణ సంతాన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టణ వీధుల్లో ఊరేగింపుగా ఆర్టీసీ కూడలి వరకు వెళ్లి తిరిగి ఆలయం వద్దకు చేరుకున్నారు. పట్టణ ప్రజలు స్వామి వారికి హారతులిచ్చి మొక్కలు తీర్చుకున్నారు.