తిరుపతి జిల్లా నాయుడుపేట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో తహశీల్దార్ గీతావాణికి కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు, న్యాయవాది హరిబాబు వినతిపత్రం సమర్పించారు. మండలంలోని సర్వే నంబర్-169లో మందబైలు నుంచి ప్రవహించే ఏటి కాలువ మీదుగా విన్నమాల, పుదూరు మీదుగా వెళ్తుందని. ఈ కాలువను బడా బాబులు కబ్జా చేశారని తెలిపారు. పంట కాలువ సర్వే చేసి హద్దులు చూపాలని కోరారు.