తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీని సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు. 116 రోజులకు గాను రూ. 67, 98, 889 ఆదాయం లభించింది. నగదుతో పాటు విదేశీ కరెన్సీ ద్వారా ఆదాయం సమకూరింది. దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసబాబు పర్యవేక్షణలో సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బి. ప్రసన్న లక్ష్మీ సమక్షంలో హుండీని లెక్కించారు.