నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ అర్చన, లక్షబిల్వార్చన పూజా కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రదోష మండపంలో వృషభ వాహనంపై శివ పార్వతుల ఉత్సవ మూర్తి విగ్రహములను వివిధ రకాల పుష్పములతో సుందరంగా అలంకరించారు. 15 మంది వేద పండితులు లక్ష బిల్వార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మ వార్ల ప్రాకారోత్సవం జరిగింది.