సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలంలోని తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ సందర్భంగా మండలంలోని వగత్తూరు ఎస్టీ కాలనీకు వెళ్లే రోడ్డు కోతకు గురై కాలువలా మారింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సోమవారం చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.