సత్యవేడు నియోజకవర్గం బీఎన్. కండ్రిగ మండలంలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా మండలంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్షపాతం వివరాలను కలెక్టరేట్, స్థానిక తహశీల్దార్ కార్యాలయ డీఎస్ఓ వెల్లడించారు. 10. 4 మిల్లీమీటర్ల వర్షపాతం మండల వ్యాప్తంగా నమోదయినట్లు చెప్పారు. వర్షం కారణంగా మండలంలో చలి తీవ్రత పెరిగింది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.