ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని డివిజన్ కార్యాలయాల్లో బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్ కో ఎస్ఈ సురేంద్ర నాయుడు సోమవారం తెలిపారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.