బెగ్గిలపల్లి: వర్షాల కోసం బండపై సహపంక్తి భోజనాలు

50பார்த்தது
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం బెగ్గిలపల్లి సమీపంలోని చిన్న మల్లప్పకొండ పై వెలసిన మల్లేశ్వర స్వామికి గ్రామస్తులు సోమవారం వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై గ్రామస్థులు భోజనాలు వండి బండపై అన్నం, కూరలు వేసుకుని సహపంక్తి భోజనాలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఇలా చేయడం వలన వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని గ్రామస్థుల నమ్మకం.

தொடர்புடைய செய்தி