గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని జాతిపిత గాంధీ విగ్రహానికి బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యధరణీలలతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాళి అర్పించారు. అలాగే స్వచ్చతా హీ సేవా - 2024 ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు.