మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలని తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జి అర్చన తెలిపారు. చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలు, మహిళల హక్కుల గురించి తెలుసుకుంటే ఎలాంటి ముప్పనైనా ఎదుర్కొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామసుబ్బయ్య, ఏపీఎం గంగయ్య తదితరులు పాల్గొన్నారు.