విజయనగరం జిల్లాలో అక్టోబర్ 6, 7, 8, తేదీలలో జరుగు విద్యా వైజ్ఞానిక మహాసభను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ వెంకట ముని పిలుపునిచ్చారు. గురువారం తిరుచానూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరపత్రం విడుదల చేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకట ముని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938), 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్య వైజ్ఞానిక మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.