AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధ, గురు వారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.