మెలియాపుట్టి మండలకేంద్రంలోని కూన అప్పలరాజు ఇంటికి సమీపంలో యువకులు భారీ కొండ చిలువను హతమార్చారు. గురువారం ఉదయం కోళ్ళ గూడులో శబ్దాలు రావడంతో వెళ్లిచూడగా ఓభారీ కొండచిలువ ఉండటంతో భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అప్పలరాజుకు చెందిన నాలుగు నాటుకోళ్ళను కొండ చిలువ మింగేసి కదలలేని స్ధితిలో ఉంటంతో పలువురు యువలకులు హతమార్చారు. సుమారు 7అడుగులు ఉన్న ఈ షర్పం మనుషులను కూడా మింగేయగలదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.