తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డు ప్రసాదంలో జీడిపప్పు వినియోగించేందుకు గాను పలాస నుండి రవాణా చేసేందుకు అంగీకారం పొందిందని మంత్రి అచ్చెన్న నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం పలాస నుండి జీడిపప్పు తీసుకు వెళుతున్న వాహనాలను ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఇది ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.