ఇచ్చాపురంలోని సురంగి రాజా క్రీడా మైదానంలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో భువనేశ్వర్, ఇచ్చాపురం జట్లు తలపడగా, ఇచ్చాపురం జట్టు విన్నర్, భువనేశ్వర్ జట్టు రన్నర్ గా నిలిచాయి. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ పాల్గొని విజేతలకు ట్రోఫీ అందజేశారు.