నందిగాం మండలం కర్లపూడిలో ఎన్నో యేండ్ల ఆకాంక్ష మిగిలిపోయిన ఆంజనేయ విగ్రహ ఏర్పాటుకు నేడు తెరపడింది. గ్రామంలోని శ్రీ ఆంజనేయ యువజన సంఘం పేరుతో యువకులు ముందుకు వచ్చి, గ్రామస్తులను ఏకతాటిపై తెచ్చి, గ్రామ పడమర దిక్కున చెరువు గట్టుమీద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు శనివారం భూమిపూజ చేశారు. మండలం కొండల ప్రాంతమంతా ప్రయాణించే త్రోవలో ఈ విగ్రహ ఏర్పాటు కాబోతుండడం కొండల ప్రాంత వాసులకు ఇది శుదాయకం అని చెప్పవచ్చు.