శాంసంగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారి పోరాటానికి మద్దతుగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా శాంసంగ్ కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే వారికి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి యూనియన్ ఏర్పాటు చేసి అండగా నిలవకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.