పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ ప్రముఖ వ్యాపారవేత్త పెంట బాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించారు. విజయవాడ వరద బాధితుల సహాయం కొరకు తాను లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళముగా చెక్కును శనివారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరిషకు లొడగల కామేష్ యాదవ్ ఆధ్వర్యంలో అందించారు.