సారవకోట మండలం బుడితి పంచాయతీలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం ఈ మేరకు స్థానిక ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొని అక్రమ మద్యం అమ్మకాలపై దృష్టి సారించారు. దుకాణాలలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తమ దృష్టికి రావడంతో అప్రమత్తం చేశామని అన్నారు. అలాగే గంజాయి అమ్మకాలు పై కూడా నిఘా ఉంచామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ తనిఖీలలో ఎటువంటి సరుకు దొరకలేదని ఆయన వివరించారు.