బూర్జ: కంట్లాం పంచాయతీలో శ్మశాన వాటిక రహదారి నిర్మాణం

70பார்த்தது
బూర్జ: కంట్లాం పంచాయతీలో శ్మశాన వాటిక రహదారి నిర్మాణం
బూర్జ మండలం కంట్లాం పంచాయతీలో ఉన్న శ్మశాన వాటిక వ్యర్థాలతో, పనికిరాని మొక్కలతో రహదారి మొత్తం మూసుకుపోయిందని స్థానిక టీడీపీ నాయకుడు మల్లేశ్ తెలిపారు. ఈ క్రమంలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా ఉపాధి నిధులతో ఈ రహదారి నిర్మాణానికి ఆదివారం శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వ హయంలో ఈ రహదారిని పూర్తిగా విడిచి పెట్టేశారని, దహన సంస్కారాల సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురఅయ్యే వారన్నారు.

தொடர்புடைய செய்தி