అనంతపురం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఉరవకొండ మండలం కౌకుంట్లకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు రవి ఎంపికయ్యారు. ఆదివారం గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఏవో నుంచి ఆయన ధ్రువపత్రాన్ని అందుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు శ్రీనివాసుల చొరవతో కమిటీ సభ్యుడిగా ఎంపికైనట్లు తెలిపారు. ఆయన ఎంపికపై తెదేపా నాయకులు రామాంజనేయులు, గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.