నార్పల మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలకు ఐ ఎస్ ఓ సర్టిఫికెట్ లభించినట్లు పాఠశాలల కన్వీనర్ సంగీత కుమారి సోమవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినోదకుమార్ చేతుల మీద సర్టిఫికెట్ అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ దేశంలో మొదటి సారి సర్టిఫికెట్ అందుకున్న ప్రభుత్వ గురుకుల పాఠశాల అని తెలిపారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది కృషితో సాధ్యమైందని తెలిపారు.