పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని చెన్నేకొత్తపల్లి సీడీపీఓ కవిత దేవి అన్నారు. మండలంలోని గంగినేపల్లిలో శనివారం జరిగిన పౌష్టికాహార మాసోత్సవాలకు హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం గురించి గర్భవతులకు, బాలింతలకు వివరించారు. చిరుదాన్యలు, ఆకు కూరలు తీసుకోవడం వలన రక్త హీనత తగ్గించి ఆరోగ్యంగా ఉండవచ్చని వెల్లడించారు.