ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మహిళలకు, నడవలేని వృద్ధులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని సత్యసాయి జిల్లా ఎస్పి రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పి అర్జీదరుల దగ్గరకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి మహిళలు వస్తే వెంటనే స్పందించి సమస్య పై విచారణ జరిపి పరిస్కారం చేయాలని ఆదేశించారు.