పుట్టపర్తి: పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛత కార్యక్రమం

54பார்த்தது
పుట్టపర్తి: పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛత కార్యక్రమం
కోర్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛత సేవా కార్యక్రమం చేపట్టినట్లు పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి కే. రాకేష్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి కోర్టు పరిసరాలను సిబ్బందితో కలసి శుభ్రం చేసారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం పరిసరాల శుభ్రత కోసం స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా కోర్టు పరిసరాలతో పాటు కార్యాలయపు ఆవరణను శుభ్రం చేసినట్లు ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி