మడకశిర నియోజకవర్గంలో సోమవారం అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పునః ప్రారంభం కానుంది. గత ప్రభుత్వంలో మూయబడిన అన్న క్యాంటీన్, ప్రస్తుత ప్రభుత్వంలో ఐదు రూపాయలకే పేదవారి ఆఖలి తీర్చడానికి పునః ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలని కోరారు.