ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాడిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర భారతం ఆవిర్భవించిన భారత పౌరులకు 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలుతో సంపూర్ణ స్వేచ్ఛ వచ్చిందన్నారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం భారత రాజ్యాంగరూపకల్పనలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఎం వెంకట చలమయ్య, నాగరాజు, టోపివలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.