భక్తి శ్రద్ధలతో హజరత్ సయ్యద్ భాష గంధం ఊరేగింపు

58பார்த்தது
భక్తి శ్రద్ధలతో హజరత్ సయ్యద్ భాష గంధం ఊరేగింపు
గుత్తి పట్టణంలోని కొండపై వెలసిన హాజరత్ సయ్యద్ బాషా రహమతుల్లా అలైహి ఖాదిరి 677వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి వారి గంధమును పట్టణంలోని పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో మేళతాళాల నడుమ ఊరేగించారు. ముందుగా కొండపై దర్గాలో ప్రత్యేక చక్కెర చదివింపులు నిర్వహించి గంధమును ఊరేగించారు. భక్తాదులు పెద్ద ఎత్తున ఈ ఉరుసు ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி