ధర్మవరం పట్టణంలో గాంధీ నగర్ పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద సోమవారం ఆటో - టూ వీలర్ ను ఢీకొన్న ప్రమాదంలో టు వీలర్ మీద వస్తున్న తారకరామాపురానికి చెందిన రమేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రమేష్ ను స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికి తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి సిఫార్సు చేశారు. ఈ ప్రమాదంపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.