ధర్మవరం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

72பார்த்தது
ధర్మవరం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వంకలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిండుకుండల్లా మారిన చెరువులు తెగకుండా పర్యవేక్షించాలన్నారు.

தொடர்புடைய செய்தி